Chandrababu: ఏపీ సీఎం జగన్ కు ప్రతిపక్ష నేత చంద్రబాబు బహిరంగ లేఖ

Chandrababu: జాబ్‌ క్యాలెండర్‌ హామీ ఏమైందని ప్రశ్నించిన చంద్రబాబు

Rama Rao
Published on: 13 Jun 2022 6:28 PM IST
TDP Chief Chandrababus Letter to AP CM Jagan | AP News
X

Chandrababu: ఏపీ సీఎం జగన్ కు ప్రతిపక్ష నేత చంద్రబాబు బహిరంగ లేఖ

Chandrababu: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ కు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. APPSCనోటిఫికేషన్ల జారీలో జాప్యం, గ్రూప్‌-1 ఉద్యోగాలకు అభ్యర్ధుల ఎంపికలో అవకతవకలపై లేఖలో ప్రస్తావించారు. నిరుద్యోగ యువత కలలు, లక్ష్యాలను సాకారం చేయాల్సిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వీర్యమైందని బాబు ఆరోపించారు.

ప్రతి ఏడాది జనవరిలో క్రమం తప్పకుండా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామన్న ప్రభుత్వం ఆ హామీ మరిచిపోయిందన్నారు. మెయిన్స్ పరీక్షల తేదీలను ఐదుసార్లు మార్చారని మూల్యాంకనం తప్పుడు తడకలుగా జరిగిందని బాబు మండిపడ్డారు. APPSC ఫస్ట్ వ్యాల్యూయేషన్ కు సెకండ్ వ్యాల్యూయేషన్ ఫలితాల్లో తేడా 15 శాతం కూడా లేనప్పుడు మరోసారి ఎందుకని.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు రాసిన లేఖలో చంద్రబాబు నిలదీశారు.

Rama Rao

Rama Rao

Next Story