సీఎం జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ

TDP Chief Chandrababu Writes Letter to CM YS Jagan
x

సీఎం జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ

Highlights

Chandrababu: ఏఆర్​ కానిస్టేబుల్​ప్రకాశ్ సస్పెన్షన్ పై సీబీఐ విచారణ జరిపించాలి

Chandrababu: సీఎం జగన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. అనంతపురం ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్‌ను అక్రమ కేసుతో సర్వీస్ నుంచి తొలగించడంపై జ్యుడిషియల్, సీబీఐ విచారణ కోరుతూ లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న ఉద్యోగులపై ప్రభుత్వమే వేధింపులకు పాల్పడడం, తప్పుడు కేసులు నమోదు చేసి వేధించడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగిస్తోందని లేఖలో పేర్కొన్నారు. ఏఆర్‌ కానిస్టేబుల్‌ ప్రకాష్‌ ఉదంతం ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా తెలిపారు. ఈ విషయంలో పోలీసు అధికారులు, ప్రభుత్వం అనుసరించిన వైఖరి పూర్తి అక్రమంగా, అన్యాయంగా, దళిత ఉద్యోగులను వేధించే విధంగా ఉందని అభిప్రాయపడ్డారు. ప్రకాష్‌ ఫిర్యాదుపై అనంతపురం టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన కేసుపై సీబీఐతో దర్యాప్తు జరపాలని డిమాండ్‌ చేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories