Chandrababu: రాష్ట్రంలో ఏ వర్గానికి రక్షణ లేకుండా పోయింది

Chandrababu: వీఓఏ నాగలక్ష్మి ఆత్మహత్య కారకులుకులు శిక్షించాలి

Rama Rao
Updated on: 18 March 2022 3:45 PM IST
TDP Chief Chandrababu Tweeted About the YCP Government | AP News Today
X

Chandrababu: రాష్ట్రంలో ఏ వర్గానికి రక్షణ లేకుండా పోయింది

Chandrababu: రాష్ర్టంలో ఏ వర్గానికి రక్షణలేకుండా పోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. మచిలీపట్నంలో విలేజ్ ఆర్గనైజింగ్ అసిస్టెంట్ నాగలక్ష్మి ఆత్మహత్య ఘటనే ఇందుకు నిదర్శనమంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. తనను అధికార పార్టీకి చెందిన వ్యక్తి వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడం దారుణమన్నారు. స్పందన కార్యక్రమంలో ఓ మహిళ స్వయంగా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడం చూస్తుంటే పోలీసులకు రాజకీయ ప్రయోజనాలే ప్రాధాన్యత అంశంగా మారిపోయాయని విమర్శించారు. నాగలక్ష్మీ ఆత్మహత్యకు కారకులను శిక్షించాలని డిమాండ్ చేశారు. నాగలక్ష్మిది ఆత్మహత్య కాదని వైసీపీ చేసిన హత్య అని నారా లోకేష్ ఆరోపించారు. రాష్ర్టంలో పోలీసు వ్యవస్థ భ్రస్టు పట్టిందని విమర్శించారు.

Rama Rao

Rama Rao

Next Story