TDP: భారీ కాన్వాయ్‌తో ఒంగోలుకు వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు

TDP: రేపటి నుంచి రెండు రోజుల పాటు ఒంగోలులో టీడీపీ మహానాడు

Rama Rao
Updated on: 26 May 2022 1:15 PM IST
TDP chief Chandrababu to Ongole with Convoy | AP News
X

TDP: భారీ కాన్వాయ్‌తో ఒంగోలుకు వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు

TDP: ఒంగోలులో పసుపు పండగకు అంతా సిద్ధమైంది. రేపటి నుంచి రెండు రోజుల పాటు జరిగే మహానాడు కార్యక్రమంతో పాటు పొలిట్ బ్యూరోలో పాల్గొనేందుకు పార్టీ అధినేత చంద్రబాబు ఒంగోలుకు బయలుదేరి వెళ్లారు. ఒక రోజు ముందుగానే మహానాడు సన్నాహాక కార్యక్రమం ప్రారంభంకానుంది. పార్టీ అధినేత చంద్రబాబు ఒకరోజు ముందుగానే భారీ ర్యాలీతో ఒంగోలు చేరుకున్నారు. సాయంత్రం జరిగే పొలిట్ బ్యూరో సమావేశంలో మహానాడు అజెండాతో పాటు రానున్న రజుల్లో పార్టీపరంగా అనుసరించే రాజకీయ విధానాలను ఖరారు చేయనున్నారు.

పార్టీ అధినేత చంద్రబాబు వెంట టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ఒంగోలుకు బయలుదేరి వెళ్లారు. రెండు రోజుల పాటు జరిగే మహానాడులో అనేక కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కన్పిస్తోంది. వచ్చే సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీ విధానాలతో పాటు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై మహానాడులో చర్చిస్తారని టీడీపీ సీనియర్ నేతలు చెప్తున్నారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమే అంటూ నేతలు ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మహానాడులో కీలక తీర్మానాలు ఉంటాయని నేతలు స్పష్టం చేస్తున్నారు.

Rama Rao

Rama Rao

Next Story