Chandrababu: నేటి నుంచి చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలన

*ఇవాళ ఉదయం కడప, మధ్యాహ్నం తిరుపతిలో పర్యటన *రేపు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్న చంద్రబాబు

Shilpa
Published on: 23 Nov 2021 7:02 AM IST
TDP Chief Chandrababu Naidu will Visit Flood Affected Areas in AP from Today 23 11 2021
X

టీడీపీ అధినేత చంద్రబాబు(ఫైల్ ఫోటో)

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు నేటి నుంచి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం కడప, మధ్యాహ్నం తిరుపతి ప్రాంతాలను పరిశీలించనున్నారు. రేపు నెల్లూరు జిల్లాలో పర్యటిస్తారు. భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన ప్రజలను ఆయన పరామర్శించనున్నారు.

రాయలసీమ, నెల్లూరు జిల్లాలో వరదల వల్ల నష్టపోయిన ప్రజలకు సాయం చేయాలని పార్టీ శ్రేణులను ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఆదేశించారు. వరద బాధితులకు ఆహారం, మందులు అందించాలని కోరారు. చిన్నపిల్లలకు పాలు, బిస్కెట్లు అందించాలని సూచించారు.

అసెంబ్లీలో జరిగిన పరిణామాల తర్వాత వరద ప్రభావిత ప్రాంతాల నుంచే చంద్రబాబు యాక్షన్‌ మొదలుకానుంది. ఇకపై ప్రజాక్షేత్రంలోనే ఉంటానని అసెంబ్లీలో శపథం చేసిన బాబు వరద ప్రభావిత జిల్లాల నుంచే జనంలోకి వెళ్లనున్నారు.

రాష్ట్రంలో ఎక్కడి సమస్యలపై అక్కడే పోరాడాలని టీడీపీ నిర్ణయించుకుంది. చంద్రబాబుతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా జనంలోనే ఉండేలా కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. ప్రజాక్షేత్రంలోనే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని టీడీపీ నేతలకు పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది.

Shilpa

Shilpa

Next Story