వంగవీటి రాధా ఇంటికి వెళ్లిన చంద్రబాబు

Chandrababu: తన హత్యకు రెక్కీ జరిగిందంటున్న వంగవీటి రాధాను టీడీపీ అధినేత చంద్రబాబు కలిశారు.

Arun Chilukuri
Published on: 1 Jan 2022 7:53 PM IST
TDP Chief Chandrababu Naidu Visits Vangaveeti Radha House
X

వంగవీటి రాధా ఇంటికి వెళ్లిన చంద్రబాబు

Chandrababu: తన హత్యకు రెక్కీ జరిగిందంటున్న వంగవీటి రాధాను టీడీపీ అధినేత చంద్రబాబు కలిశారు. రాధా ఇంటికి వెళ్లి మాట్లాడారు. రాధాపై రెక్కీ సమయంలో వచ్చిన కారు ఎవరిదో పోలీసులు తేల్చాలని డిమాండ్ చేశారు. రాధాపై రెక్కీ జరిగిందా లేదా అనేది చెప్పాల్సిన బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. రెక్కీపై పోలీసుల వద్ద ఉన్న ఆధారాలు కూడా బయటపెట్టాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. రెక్కీ ఘటనపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించడంలేదు. వారం గడుస్తున్నా ఇంతవరకు ఏమీ తేల్చలేదు. తన లేఖ ఆధారంగా విచారణ చేయలేరా? ఇలాంటి ఘటనల్లో కాలయాపన మంచిది కాదని చంద్రబాబు స్పష్టం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story