Chandrababu: కష్టపడేవారికే టికెట్.. షో చేసేవారిని పక్కనపెడతాం

* రాజకీయాలు మారాయి.. మనమూ మారాలి -చంద్రబాబు * రాష్ట్రవ్యాప్తంగా గ్రామస్థాయి నుంచి గౌరవ సభలు నిర్వహించాలని నిర్ణయం

Shilpa
Published on: 26 Nov 2021 8:28 PM IST
TDP Chief Chandrababu Naidu Sensational Comments in TDP Politburo Meeting
X

టీడీపీ పొలిట్‌ బ్యూరో సమావేశంలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు(ఫైల్ ఫోటో)

Chandrababu: పార్టీలో ఇకపై కష్టపడేవారికే టికెట్ కేటాయిస్తామని, షో చేసేవారిని పక్కన పెడతామని తేల్చిచెప్పేశారు చంద్రబాబు. కొంతమంది నేతలు కర్చీఫ్‌ వేసుకొని కూర్చుంటున్నారని, మరికొంతమంది పార్టీ కార్యక్రమాలు కూడా నిర్వహించడంలేదని అసహనం వ్యక్తం చేశారు. రాజకీయాలు మారాయని, అందుకు తగ్గట్టుగా మనమూ మారాలన్న చంద్రబాబు కొంతమంది నాయకులు దూకుడుగా మాట్లాడటంలేదన్నారు.

మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరిగిన పొలిట్‌ బ్యూరో సమావేశంలో పలు అంశాలపై చంద్రబాబు చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామస్థాయి నుంచి గౌరవ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. క్రిందిస్థాయి కార్యకర్తలతో నాయకులు పనిచేసేలా కార్యాచరణ రూపొందించాలని, అలాగే ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై దూకుడు పెంచాలని సూచించారు. మహిళలపై దుష్ప్రచారం, అసెంబ్లీలో జరిగిన ఘటనలను క్షేత్రస్థాయిలో తీసుకెళ్లాలని నేతలకు దిశానిర్దేశం చేశారు చంద్రబాబు.

Shilpa

Shilpa

Next Story