Chandrababu: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫైర్

Chandrababu: వరద సహాయక చర్యల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టమైందన్న చంద్రబాబు

Shireesha
Published on: 4 Dec 2021 3:00 PM IST
TDP Chief Chandrababu Fires on YCP Government
X

వరద సహాయక చర్యల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టమైందన్న చంద్రబాబు(ఫైల్-ఫోటో)

Chandrababu: కడప జిల్లాలో వరద బీభత్సం పెద్ద సంఖ్యలో ప్రాణాలను బలిగొన్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు జగన్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే 62 మంది చనిపోయారని, 6 వేల కోట్ల మేర ఆస్తి, పంట నష్టం జరిగిందని ఆరోపించారు. ఇదే విషయంపై కేంద్రమంత్రి కూడా ప్రకటన చేశారని అన్నారు. కేంద్రమంత్రి ప్రకటనకు ఏం సమాధానం చెబుతారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అన్నమయ్య ప్రాజెక్టు గేట్లకు మరమ్మతులు చేయించకపోవడంతో గేట్లు మొత్తం కొట్టుకుపోయాయని చంద్రబాబు ఆరోపించారు.

Shireesha

Shireesha

Next Story