Chandrababu: మూడేళ్ల పాలనలో రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కు తీసుకెళ్లారు

Chandrababu: జగన్ అసమర్ధ పాలనతో ప్రజలు ఇబ్బందుల పడుతున్నారు

Rama Rao
Updated on: 4 Jun 2022 12:43 PM IST
TDP Chief Chandrababu fire on CM Jagan | AP News
X

Chandrababu: మూడేళ్ల పాలనలో రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కు తీసుకెళ్లారు

Chandrababu: సీఎం జగన్ పై మరోసారి ఫైర్ అయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు. బిల్లుల కోసం కాంట్రాక్టర్లు కోర్టులకు వెళ్లొద్దంటూ టెండర్లలో ప్రభుత్వం పెట్టిన నిబంధనపై చంద్రబాబు మండిపడ్డారు. జగన్ సర్కార్ మూడేళ్ల పాలన రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కు తీసుకెళ్లిందని విమర్శించారు. బిల్లుల కోసం కోర్టులకు వెళ్లొద్దంటూ టెండర్లలో నిబంధనలు పెట్టడం జగన్ అసమర్థ పాలనకు నిదర్శనమని చంద్రబాబు విమర్శించారు.

కృష్ణా డెల్టాకు కాలువల మరమ్మతుల కోసం 13 కోట్ల టెండర్ పనులకు పెట్టిన ఆ నిర్ణయం రాష్ట్ర పరువును తీసేసిందన్నారు. అసమర్థ పాలకులకు సిగ్గుగా అనిపించి ఉండకపోయినా..ప్రభుత్వం నిజంగా సిగ్గుపడే నిర్ణయమని చంద్రబాబు అన్నారు. ఇలాంటి నిబంధనలు దేశంలోని ఏ రాష్ట్రంలో ఉండవని ఎద్దేవా చేశారు.


Rama Rao

Rama Rao

Next Story