Chandrababu: ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అయింది

Chandrababu: ప్రతిపక్ష పార్టీల నేతలను జగన్ సర్కారు దారుణంగా అవమానిస్తోంది

Rama Rao
Published on: 18 Oct 2022 6:05 PM IST
TDP Chief Chandrababu Comments on YCP Government | AP News
X

Chandrababu: ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అయింది

Chandrababu: ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. ప్రతిపక్ష పార్టీలను, నాయకులను దారుణంగా అవమానిస్తూ జగన్ ఆనందం పొందుతున్నారని.. ఆ ఆనందం శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలన్నారు. పవన్ విశాఖ వెళ్తే తప్పేంటి అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రక్రియ కోసం పవన్ తో కలిసి చర్చించానని అవసరమైతే అన్ని రాజకీయ పార్టీలతో చర్చిస్తామన్నారు.

పోలీసు అధికారులు కూడా పక్షపాతంగా వ్యవహరిస్తున్నారన్నారు. విశాఖ ఘటనల తరువాత జనసేన కార్యకర్తల పట్ల, పవన్ పట్ల పోలీసులు అనుసరించిన వైఖరిని చంద్రబాబు ఖండించారు. జగన్ ప్రభుత్వంపై పవన్ తీవ్రస్థాయిలో మాట్లాడిన తరువాత ఆయనకు సంఘీభావం ప్రకటించేందుకు చంద్రబాబు నోవాటెల్ కు వెళ్లారు. ఆ తరువాత జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు.

Rama Rao

Rama Rao

Next Story