Chandrababu: అయ్యన్నది కబ్జా కాదు.. ఇడుపులపాయలో వైఎస్‌ కుటుంబం చేసిందే కబ్జా!

Chandrababu: తప్పు చేసిన అధికారులు మూల్యం చెల్లించుకోవాలి

Rama Rao
Updated on: 20 Jun 2022 4:37 PM IST
TDP Chief Chandrababu Comments on CM YS Jagan | AP News
X

Chandrababu: అయ్యన్నది కబ్జా కాదు.. ఇడుపులపాయలో వైఎస్‌ కుటుంబం చేసిందే కబ్జా!

Chandrababu: రాత్రి పూట అయ్యన్న ఇంటి కూల్చివేతపై కోర్టు వ్యాఖ్యలకు సీఎం జగన్ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు టీడీపీ అధినేత చంద్రబాబు. తప్పు చేసిన అధికారులు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అయ్యన్నది కబ్జా కాదని ఇడుపులపాయలో వైఎస్ కుటుంబం చేసింది కబ్జానని తెలిపారు. నిత్యం టీడీపీ నేతలను హౌస్ అరెస్టులు చేయడం జగన్ పిరికితనాన్ని చాటుతున్నాయని ఛలో నర్సీపట్నం కార్యక్రమానికి వెళ్తున్న నేతలను అరెస్ట్ చేయడం అక్రమమని బాబు ఫైర్ అయ్యారు. గట్టిగా గళం వినిపిస్తున్న టీడీపీ బీసీ నేతలపై కేసులు, అరెస్ట్ లు, ఇళ్ళపై దాడులతో జగన్ వేధించే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు అన్నారు.


Rama Rao

Rama Rao

Next Story