Chandrababu: మూడేళ్లలో ఎయిమ్స్‌ కోసం ఏం చేశారో చెప్పగలరా?

Chandrababu: వైద్యరంగంపై సీఎం జగన్ బొంకుడు ప్రకటనలు మాని ఎయిమ్స్‌లో నీటి సమస్యను పరష్కరించాలని చంద్రబాబు డిమాండ్

Rama Rao
Updated on: 26 Sept 2022 8:00 PM IST
TDP Chief Chandrababu Comments on CM Jagan on Twitter
X

ట్విట్టర్ వేదికగా సీఎం జగన్‌పై చంద్రబాబు విమర్శలు

Chandrababu: సీఎం జగన్‌పై ట్విట్టర్‌ వేదికగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. జగన్, మంత్రులు పథకాల గురించి గొప్పలు చెప్పుకోవడం పక్కనపెట్టి, మంగళగిరి ఎయిమ్స్‌‌కు నీటి సరఫరాపై దృష్టి పెట్టాలని సూచించారు. కనీసం నీటి వసతి కూడా కల్పించలేని ప్రభుత్వాన్ని ఏమనాలని ప్రశ్నించారు. లేఖ రాసినా పరిష్కరించకపోవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని పేర్కొన్నారు. ఎయిమ్స్‌కు నీటి వసతిపై కేంద్రమంత్రులు ప్రశ్నించినా స్పందించని జగన్‌ అన్ని వైద్య కళాశాలలు తామే తెచ్చామని శాసనసభలో అసత్య ప్రచారం చేసుకోవడం దారుణమన్నారు.

రాష్ట్రంలో మెడికల్ కాలేజ్‌లు అన్నీ తామే తెచ్చామని అసెంబ్లీలో సైతం అసత్యాలు పలికిన సీఎం.. తానుంటున్న మున్సిపాలిటీ నుంచి ఆసుపత్రికి నీళ్లెందుకు ఇవ్వలేకపోతున్నారని నిలదీశారు. జగన్‌ చేతగానితనం లక్షల మంది ప్రజలకు శాపంగా మారకూడదని హితవు పలికారు. ప్రభుత్వం వెంటనే ఎయిమ్స్‌కు అవసరమైన అన్ని అదనపు మౌలిక సదుపాయాలు కల్పించాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.

Rama Rao

Rama Rao

Next Story