Chandrababu: జ‌నార్ద‌న్ రెడ్డిని కోర్టులో ఎందుకు హాజ‌రుప‌ర్చ‌లేదు

Chandrababu: టీడీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఏపీ డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్ కు లేఖ రాశారు.

Samba Siva Rao
Published on: 25 May 2021 2:36 PM IST
Chandra babu Written Letter To  AP DGP
X

చంద్ర‌బాబు ఫైల్ ఫోటో 

Chandrababu: టీడీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఏపీ డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్ కు లేఖ రాశారు. క‌ర్నూలు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి, అనుచ‌రుల‌ను ఇంత‌వ‌ర‌కు కోర్టులో హాజ‌రుప‌ర్చ‌లేదని లేఖ‌లో ప్ర‌స్తావించారు. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా అదుపులో ఉంచుకోవ‌డం ఉల్లంఘ‌నే అని అన్నారు. అక్ర‌మంగా అరెస్టు చేసిన వారిని వెంట‌నే విడుద‌ల చేయాల‌ని చంద్ర‌బాబు డిమాండ్ చేశారు. బీసీ జ‌నార్ద‌న్ రెడ్డిపై అక్ర‌మ కేసులు పెట్టార‌ని చంద్ర‌బాబు పేర్కొన్నారు.

ఇదే విష‌యంపై చంద్ర‌బాబు నాయుడు టెలీకాన్ఫ‌రెన్స్‌లో టీడీపీ నేత‌ల‌తో మాట్లాడారు. అక్ర‌మ కేసుల‌తో వేధించ‌డ‌మే వైసీపీ స‌ర్కార్ ప‌నిగా మారింద‌ని విమ‌ర్శించారు. జ‌నార్ద‌న్ రెడ్డి ఇంటిపైకి కొంద‌రు దాడికి వ‌చ్చారని, తిరిగి జ‌నార్ద‌న్ పైనే కేసులు పెట్ట‌డం ఏంటీ? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. పోలీసులు ఉన్న‌ది దొంగ‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించ‌డానికా? అని నిల‌దీశారు. జ‌నార్ద‌న్ రెడ్డి విష‌యంలో అవ‌స‌ర‌మైతే సుప్రీంకోర్టుకు వెళ‌తామ‌ని చంద్ర‌బాబు అన్నారు.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story