సీఎం జగన్‌పై చంద్రబాబు ట్వీట్

Chandrababu: ప్రజావేదిక కూల్చి మూడేళ్లని గుర్తు చేసిన బాబు, డిస్ట్రక్షన్ తప్ప కన్‌స్ట్రక్షన్ చేత కాదని ట్వీట్

Jyothi
Updated on: 25 Jun 2022 2:07 PM IST
TDP Chandrababu Tweets On CM Jagan
X

సీఎం జగన్‌పై టీడీపీ చంద్రబాబు ట్వీట్

Chandrababu: ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ప్రజావేదిక కూల్చి వికృతానందం పొందిన జగన్... మూడేళ్లలో కట్టింది శూన్యమంటూ ట్వీట్ చేశారు. అధికారంలోకి రాగానే జగన్ చేసిన మొట్టమొదటి పని ప్రజావేదిక కూల్చివేతకు మూడేళ్లని గుర్తు చేశారు.డిస్ట్రక్షన్ తప్ప కన్‌స్ట్రక్షన్ చేతగాని జగన్ చేసినవన్నీ కూల్చివేతలేనని ఆరోపించారు. కూల్చడం కంటే నిర్మించడం ఎంత కష్టమైన పనో మూడేళ్ల పాలన తరువాతైనా జగన్ తెలుసుకోవాలని బాబు సూచించారు.

Jyothi

Jyothi

Next Story