విజయవాడ మేయర్ అభ్యర్థిగా కేశినేని శ్వేత

Arun Chilukuri
Published on: 4 March 2021 7:56 PM IST
విజయవాడ మేయర్ అభ్యర్థిగా కేశినేని శ్వేత
X

విజయవాడ మేయర్ అభ్యర్థిగా కేశినేని శ్వేత

విజయవాడ నగర టీడీపీ మేయర్ అభ్యర్ధి ఖరారైయ్యారు. ఎంపీ కేశినేని తనయురాలు శ్వేత పేరును టీడీపీ అధిష్టానం ఖరారు చేసింది. కార్పొరేటర్ అభ్యర్ధిగా పోటీలో ఉన్న కేశినేని శ్వేతను మేయర్‌ అభ్యర్థిగా అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు. కేశినేని శ్వేత 11వ డివిజన్‌ నుంచి బరిలో ఉన్నారు. 24 ఏళ్ల కేశినేని శ్వేత అట్లాంటాలోని ఎమోరీ విశ్వవిద్యాలయంలో బీఏ (సైకాలజీ, ఎకనామిక్స్‌) చేశారు. ఘనాలో మైక్రో ఫైనాన్స్‌ కమ్యూనిటీ సర్వీస్‌ ప్రాజెక్ట్‌.. ఐర్లాండ్‌లో చైల్డ్‌ సైకాలజీ ప్రోగ్రామ్‌లో ఆమె పనిచేశారు. టాటా ట్రస్ట్‌కు సంబంధించిన ప్రాజెక్టుల్లోనూ శ్వేత వివిధ బాధ్యతలు చేపట్టారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story