టీడీపీ సంచలన నిర్ణయం

టీడీపీ సంచలన నిర్ణయం
x
Highlights

టీడీపీ సంచలన నిర్ణయం తీసుకుంది. రేపు జరిగే అసెంబ్లీ సమావేశానికి దూరంగా వుండాలని టీడీఎల్పీ నిర్ణయించింది. మండలిలో జరిగిన చర్చను అసెంబ్లీలో చర్చించడం...

టీడీపీ సంచలన నిర్ణయం తీసుకుంది. రేపు జరిగే అసెంబ్లీ సమావేశానికి దూరంగా వుండాలని టీడీఎల్పీ నిర్ణయించింది. మండలిలో జరిగిన చర్చను అసెంబ్లీలో చర్చించడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది. ప్రభుత్వ తీరుకు నిరసనగా రేపటి అసెంబ్లీ సమావేశానికి గైర్ హాజర్ కావాలని టీడీఎల్పీ నిర్ణయించింది.

చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో ఆదివారం టీడీపీఎల్పీ భేటీ అయ్యింది. ఐదుగురు ఎమ్మెల్సీలు మినహా 24 మంది సమావేశానికి వచ్చారు. టీడీఎల్పీ సమావేశానికి రాలేమని ముందుగానే సమాచారం ఇచ్చారు ఐదుగురు ఎమ్మెల్సీలు. వీరిలో గాలి సరస్వతి, కేఈ ప్రభాకర్, తిప్పేస్వామి, శత్రుచర్ల విజయరామరాజు, ఏఎస్ రామకృష్ణ ఉన్నారు.Show Full Article
Print Article
More On
Next Story
More Stories