Tarun Chugh: రేపు విజయవాడకు తరుణ్‌చుగ్.. ఏపీ బీజేపీ నేతలతో భేటీ

Tarun Chugh: టీడీపీ, జనసేనతో కలిసి వెళ్లడంపై అభిప్రాయ సేకరణ

Shekhar G
Published on: 3 Jan 2024 12:03 PM IST
Tarun Chugh To Vijayawada Tomorrow
X

Tarun Chugh: రేపు విజయవాడకు తరుణ్‌చుగ్.. ఏపీ బీజేపీ నేతలతో భేటీ

Tarun Chugh: బీజేపీ అగ్ర నేత తరుణ్ చుగ్ రేపు విజయవాడకు రానున్నారు. తొలిసారి ఏపి బీజేపీ నేతలతో భేటీ కానున్నారు. విజయవాడలో ఇవాళ, రేపు జిల్లా ఇన్‌చార్జులు, పదాధికారులు, జిల్లా అధ్యక్షుల సమావేశం జరుగుతుంది.. ఇవాళ జరిగే సమావేశంలో జాతీయ సహా సంఘటన కార్యదర్శి శివ ప్రకాష్ పాల్గొంటున్నారు. రెండు రోజుల సమావేశంలో ఎపిలో పొత్తులపై నేతలకు పూర్తి స్థాయిలో స్పష్టత ఇచ్చే అవకాశముంది. టీడీపీ, జనసేనతో కలిసి వెళ్ళే అంశంలో నేతల అభిప్రాయాలను అడిగి తెలుసుకునే అవకాశముంది. రేపటి తరుణ్ చుగ్ తో జరిగే సమావేశానికి ఏపి బీజేపీ కీలక నేతలు కిరణ్ కుమార్ రెడ్డి,సీఎం రమేష్ , సుజనా చౌదరి, తదితరులు హాజరుకానున్నారు.

Shekhar G

Shekhar G

Next Story