ఏపీ అసెంబ్లీలో కరోనా కలకలం

Arun Chilukuri
Published on: 2 Dec 2020 10:57 AM IST
ఏపీ అసెంబ్లీలో కరోనా కలకలం
X

ఏపీ అసెంబ్లీలో కరోనా కలకలం సృష్టిస్తోంది. తణుకు ఎమ్మెల్యే కారుమురి నాగేశ్వర్‌రావుకి కరోనా పాజిటివ్‌గా నిర్ధరాణ అయింది. రెండు రోజులుగా కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాలకు కారుమురి హాజరు అయ్యారు.. దాంతో ఆయనను కలిసిన ఎమ్మెల్యేలలో టెన్షన్ నెలకొంది. ఇప్పుడు ఇదే విషయం ఏపీ అసెంబ్లీలో హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు నిన్న అసెంబ్లీలో కారుమురి నాగేశ్వరావు ప్రసంగించారు. కోవిడ్ రావడంతో అసెంబ్లీ సమావేశాలకు నాగేశ్వర్‌రావు దూరం అయ్యారు. ఆయనను కలిసిన ఎమ్మెల్యేలు ఈ రోజు అసెంబ్లీకీ గైర్హజరు అయ్యారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story