Tamil Nadu Elections 2021: డీఎంకేకే పట్టం కడుతున్న తమిళ సర్వేలు

Tamil Nadu Elections 2021: తమిళ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. రాష్ట్రంలో నిర్వహించిన ఎన్నికల సర్వేలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

Arun Chilukuri
Published on: 17 March 2021 9:10 PM IST
Tamil Nadu Elections 2021: డీఎంకేకే పట్టం కడుతున్న తమిళ సర్వేలు
X

డీఎంకేకే పట్టం కడుతున్న తమిళ సర్వేలు

Tamil Nadu Elections 2021: తమిళ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. రాష్ట్రంలో నిర్వహించిన ఎన్నికల సర్వేలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. స్టాలిన్‌ నాయకత్వంలోని డీఎంకే ఘన విజయం సాధిస్తుందని సర్వేలు ఘోషిస్తున్నాయి. తమిళ ఓటర్ల నాడిని తెలుసుకునేందుకు జనవరిలో ఏబీపీ - సి ఓటరు ఒక సర్వే నిర్వహించింది. ఇందులో డీఎంకేనే విజయం సాధిస్తుందని వెల్లడైంది. కొన్ని రోజుల క్రితం టైమ్స్‌ నౌ - సి ఓటరు కలిసి నిర్వహించిన సర్వేలోనూ తమిళ ప్రజలు డీఎంకేకే పట్టం కట్టారు.

ఈ నేపథ్యంలో తాజాగా ఏబీపీ - సీ ఓటరు మరోమారు సర్వే నిర్వహించింది. ఇందులోనూ డీఎంకేనే అధికారంలోకి వస్తుందని తేలింది. మొత్తం 234 అసెంబ్లీ స్థానాల్లో డీఎంకే కూటమి 161 నుంచి 169 సీట్లను గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని వెల్లడైంది. అన్నాడీఎంకే కూటమి 53 నుంచి 61 సీట్లతో సరిపెట్టుకోక తప్పదని సర్వేలు చెబుతున్నాయి. కమల్‌హాసన్‌ పార్టీ 2 నుంచి 6 సీట్లు టీటీవీ దినకరన్‌ సారథ్యంలోని ఏఎంఎంకే పార్టీ 1 నుంచి 5 సీట్లు గెలుచుకోవచ్చని సర్వేలు అంచనా వేస్తున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story