AP Jobs: ఏపీ విద్యార్థులకు బంపర్ ఆఫర్.. తిరుపతి ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్యోగాలు..

AP Jobs: పది, ఇంటర్ చదివిన ఏపీ నిరుద్యోగులకు ఇది బంపర్ ఆఫర్ అనే చెప్పవచ్చు.

Arun Chilukuri
Published on: 25 Feb 2022 9:22 PM IST
SVRR Government General Hospital Tirupati Recruitment 2022 Tenth, Inter Qualified Jobs
X

AP Jobs: ఏపీ విద్యార్థులకు బంపర్ ఆఫర్.. తిరుపతి ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్యోగాలు..

AP Jobs: పది, ఇంటర్ చదివిన ఏపీ నిరుద్యోగులకు ఇది బంపర్ ఆఫర్ అనే చెప్పవచ్చు. తిరుపతిలోని ఎస్‌వీఆర్‌ఆర్‌ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి జాబ్‌ నోటిఫికేషన్ విడుదలైంది. ఒప్పంద, ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం మొదలైన వివరాలు తెలుసుకుందాం. ఉద్యోగం సంపాదిస్తే స్థానికంగానే ఉండొచ్చు.

మొత్తం 28 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఫిజిసిస్ట్‌/న్యూక్లియర్‌ ఫిజిసిస్ట్‌, రేడియోలాజికల్‌ ఫిజిసిస్ట్‌, ల్యాబ్‌ టెక్నాషియన్‌, ఫార్మసిస్ట్‌, డెంటల్‌ టెక్నీషియన్‌, స్పీచ్‌ థెరపిస్ట్‌, డయాలసిసి టెక్నీషియన్‌, ఆపరేషన్‌ థియేటర్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉన్నాయి. అభ్యర్ధుల వయసు 42 ఏళ్లకు మించరాదు. ఎంపికైతే నెలకు రూ.12,000ల నుంచి రూ.28,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. పోస్టును బట్టి పది, ఇంటర్‌, డిప్లొమా, బీఎస్సీ, ఎమ్మెస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే వ్యాలిడ్‌ గేట్ స్కోర్‌, సంబంధిత టెక్నికల్‌ నాలెడ్జ్‌ కూడా అవసరం.

అకడమిక్‌ మెరిట్‌, అనుభవం, రిజర్వేషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అడ్రస్‌ SVRR Government General Hospital, Tirupati, Chittoor district. దరఖాస్తులకు చివరి తేదీ ఫిబ్రవరి 28, 2022గా నిర్ణయించారు. అర్హులైన అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకుంటే మంచిది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story