ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్

AP Assembly: 11 మంది టీడీపీ సభ్యులు ఒకరోజు సస్పెన్షన్

Rama Rao
Published on: 16 March 2022 10:46 AM IST
Suspension of TDP Members from AP Assembly | AP News Today
X

ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్

AP Assembly: ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు సస్పెన్షన్ కు గురయ్యారు. సభా కార్యక్రమాలకు అడ్డుపడుతున్నారని 11 మంది టీడీపీ సభ్యులను ఒక రోజు సస్పెండ్ చేశారు స్పీకర్. సభ్యులు సభా హక్కులను ఉల్లంఘిస్తున్నారని స్పీకర్ ఆగ్రం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులు సత్యప్రసాద్, చినరాజప్ప, రామ్మోహన్, సాంబశివరావు, గొట్టిపాటి రవి. రామరాజు, భవానీ, జోగేశ్వర్ రావు, అసోక్ రామకృష్ణ, గణబాబును సస్పెండ్ చేశారు. సభ జరుగుతున్న తీరుపై ప్రజలు అసహ్యించుకుంటున్నారని స్పీకర్ తమ్మినేని అన్నారు.

సభ ప్రారంభంలో సీఎం జగన్ పై టీడీపీ సభ్యులు సభా హక్కుల నోటీసు ఇచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో కల్తీసారా మరణాలు సహజ మరణాలుగా చిత్రీకరించి సభను ప్రజలు తప్పుదోవ పట్టిస్తున్నారని టీడీపీ సభ్యులు ఆరోపించారు. టీడీపీ సభా హక్కుల నోటీసును స్పీకర తిరస్కరించారు. స్పీకర్ నిర్ణయానికి వ్యతిరేకంగా సభలో టీడీపీ సభ్యులు నిరసన తెలిపారు.

Rama Rao

Rama Rao

Next Story