AP Assembly: ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్

Suspension Of TDP Members From AP Assembly
x

AP Assembly: ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్

Highlights

AP Assembly: మిగిలిన టీడీపీ సభ్యులందరూ ఒకరోజు సస్పెన్షన్

AP Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో తొలిరోజు వాయిదాల పర్వం కొనసాగుతోంది. సభ ప్రారంభమైన వెంటనే చంద్రబాబు అరెస్ట్ అక్రమమంటూ టీడీపీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. చంద్రబాబు అరెస్ట్ పై చర్చించాలని టీడీపీ సభ్యులు పట్టుపట్టారు. స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్లి టీడీపీ సభ్యుల నిరసన తెలిపారు. టీడీపీ సభ్యుల నినాదాల మధ్యే ప్రశ్నోత్తరాలు కొనసాగాయి. టీడీపీ సభ్యులు నినాదాలు చేస్తూ స్పీకర్ స్థానం దగ్గరకు వెళ్లి ప్లకార్డులు చూపిస్తూ నినాదాలు చేశారు. సభ్యులు ఎవరి స్థానాల్లో వారు కూర్చోవాలని స్పీకర్ సూచించినా.. టీడీపీ ఎమ్మెల్యేలు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూనే ఉన్నారు. స్పీకర్లపై పేపర్లు విసిరి.. నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు, వైసీపీ సభ్యుల వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ టీడీపీ సభ్యులు మరోసారి నినాదాలు చేశారు. దీంతో సభ్యుల నినాదాలు, గందరగోళం మధ్య అసెంబ్లీ వాయిదా పడింది.

వాయిదా అనంతరం ప్రారంభమైన సభలో టీడీపీ సభ్యులపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారు. ముగ్గురు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేసిన స్పీకర్.. ఈ సమావేశాలు ముగిసే వరకు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్ పై సస్పెన్షన్ వేటు వేశారు. మిగిలిన టీడీపీ సభ్యులందరిని ఒకరోజు సస్పెండ్ చేశారు. అనంతరం సభను మరోసారి వాయిదా వేశారు. కొంతసేపు విరామం తర్వాత.. సభ మరోసారి ప్రారంభమైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories