Anandaiah Medicine: ఆనందయ్య మందు పై తీవ్ర ఉత్కంఠ

Anandaiah Medicine: మంత్రి పేర్నినాని ఆనందయ్యతో భేటీ అయి.. అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Kranthi
Updated on: 22 May 2021 12:36 PM IST
Suspense Continuing Over Approval of Anandaiah’s Medicine
X

Anandaiah (file image)

Anandaiah Medicine: కరోనా కన్నా ఇప్పుడు హాట్ టాపిక్ ఆనందయ్య. అవును ఆనందయ్య మందు పని చేస్తుందా లేదా... ఆయనిచ్చే పసరులో పస ఉందా లేదా ఇదే చర్చ ఇప్పుడు ఏపీ, తెలంగాణలతో పాటు చుట్టుపక్కల రాష్ట్రాల్లోనూ తీవ్రంగా నడుస్తోంది. ఆయన మందు వేయించుకున్న మాస్టర్ కోటయ్యకు మళ్లీ ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయాయి. ఆయన పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మందు బాగా పని చేసిందని ఈయన చెప్పిన వీడియో సోషల్ మీడియాలో ఫుల్లు వైరల్ అయిపోయింది. ఇప్పుడు మాత్రం ఆయన పరిస్ధితి అలా ఉంది.

మరోవైపు ప్రభుత్వం ఆనందయ్య మందుపై కసరత్తు ప్రారంభించింది. మంత్రి పేర్నినాని ఆనందయ్యతో భేటీ అయి.. అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆనందయ్య మందు పంపిణీ కేంద్రాన్ని మాత్రం ఖాళీ చేయించి పోలీసులు మూసివేయించేశారు. ఆయుష్ అధికారులు రహస్య ప్రాంతంలో ఆనందయ్య మందును పరిశీలిస్తున్నారు. ఆనందయ్య వారికి డెమో ఇస్తున్నట్లు సమాచారం. దీని తర్వాత ఆయుష్ అధికారులు ఆమోదిస్తే మాత్రం ఆనందయ్య మందు పంపిణీకి భారీ ఏర్పాట్లు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం.

ఇంకోవైపు ఆనందయ్య మందును ప్యాకెట్ల రూపంలో ఓ ముఠా బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటోంది. ఇప్పటికే ఆనందయ్య మందులో ఏమేం వాడుతున్నారు వంటి వివరాలన్నీ సోషల్ మీడియాలో వచ్చేశాయ్. ఇంకేముంది కొందరు మాఫియాగాళ్లు.. ఆయన పేరుతో ప్యాకెట్లు అమ్మే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆనందయ్య అనుచరులు మాత్రం అలాంటివి నమ్మకండని ప్రకటించారు.

Kranthi

Kranthi

Next Story