Surveillance Cameras: ఏపీలో ఇకపై రిజిస్ట్రేషన్ కార్యాలయంలో వీడియో రికార్డింగ్

X
Highlights
Surveillance Cameras: ఏపీలో ఇకపై రిజిస్ట్రేషన్ కార్యాలయంలో వీడియో రికార్డింగ్ చేయాలని రాష్ట్ర...
Arun Chilukuri17 Aug 2020 9:40 AM GMT
Surveillance Cameras: ఏపీలో ఇకపై రిజిస్ట్రేషన్ కార్యాలయంలో వీడియో రికార్డింగ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వీడియో రికార్డింగ్, పర్యవేక్షణకు ఏర్పాట్లు చేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియకు పర్యవేక్షణకు రెవెన్యూశాఖ కార్యాచరణను రూపొందిస్తోంది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఏపీలో 20 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వీడియో రికార్డింగ్ ప్రక్రియను చేపట్టనుంది. కంట్రోల్ రూమ్ ద్వారా వీడియో రికార్డింగ్ పర్యవేక్షించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. యూజర్ చార్జీల ద్వారా వీడియో రికార్డింగ్ ఖర్చులు. ఉత్తర్వులు జారీ చేసిన రెవెన్యూ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ.
Web TitleSurveillance Cameras To Record Registration offices in Andhra Pradesh
Next Story