చంద్రగిరి డీఎస్పీ శరత్‌ రాజ్‌కుమార్‌పై బదిలీ వేటు

Chandragiri: తిరుపతి జిల్లా చంద్రగిరి డీఎస్పీ శరత్ రాజ్‌కుమార్‌పై బదిలీ వేటు పడింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 30 May 2024 9:34 AM IST
Surrendering Chandragiri DSP to the Office of DGP
X

చంద్రగిరి డీఎస్పీ శరత్‌ రాజ్‌కుమార్‌పై బదిలీ వేటు

Chandragiri: తిరుపతి జిల్లా చంద్రగిరి డీఎస్పీ శరత్ రాజ్‌కుమార్‌పై బదిలీ వేటు పడింది. తిరుపతిలోని మహిళా వర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమ్‌, కౌంటింగ్‌ హాల్‌లోకి తన స్నేహితుడిని తీసుకెళ్లారనే ఆరోపణలతో బదిలీ వేటు వేశారు ఉన్నతాధికారులు. బుధవారం సాయంత్రం ఆయన స్నేహితుడైన ఓ హోమియోపతి డాక్టర్‌ను నేరుగా కౌంటింగ్‌ హాల్‌కి తీసుకెళ్లడం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. ఘటనపై సీరియస్ అయిన జిల్లా ఎన్నికల అధికారి జిల్లా ఎస్పీకి సమాచారం ఇవ్వడంతో డీజీపీ కార్యాలయానికి నివేదిక పంపించారు.

దీంతో వెంటనే డీఎస్పీని శరత్ రాజ్‌కుమార్‌ డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశాలు వెలువడ్డాయి. మరో వైపు పోలింగ్ రోజు చంద్రగిరి మండలం కూచివారిపల్లె, రామిరెడ్డిపల్లెలో చోటు చేసుకున్న ఘర్షణలు, దాడులకు చంద్రగిరి పోలీసుల వైఫల్యమే కారణమని సిట్ బృందం నివేదిక ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మరికొంత మంది పోలీసు అధికారులపై కూడా త్వరలోనే వేటు పడే అవకాశం ఉన్నట్లు సమాచారం.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story