Re -Tendering: రీ టెండరింగ్ తో కలిసొస్తున్న ఆదాయం.. పంచాయతీరాజ్ పనుల్లో మిగులు

Re -Tendering: టెండర్లలో మతలబులను నిరోధించి, నాణ్యమైన పనులు చేపట్టడంతో పాటు అధిక వ్యయాన్ని తగ్గించేందుకు వీలుగా ప్రభుత్వం తీసుకొచ్చిన రీ టెండరింగ్ విధానం
Re -Tendering: టెండర్లలో మతలబులను నిరోధించి, నాణ్యమైన పనులు చేపట్టడంతో పాటు అధిక వ్యయాన్ని తగ్గించేందుకు వీలుగా ప్రభుత్వం తీసుకొచ్చిన రీ టెండరింగ్ విధానం మంచి ఫలితాలను ఇస్తోంది. గతంలో పోలవరం తదితర పనుల్లో ఇలా చేయడం వల్ల వందల కోట్ల ఆదాయం కలిసి వచ్చింది. ఇదే విధానాన్ని పీఎంజీఎస్ వై పనుల్లో సైతం చొప్పించడం వల్ల కొంత ఆదాయం కలిసింది... టెండర్లలో సంబంధిత పనికి ముందుగా అధికారులు నిర్ధారించిన దానికన్నా కాంట్రాక్టర్ అధిక ధరకు కోట్ చేస్తే.. మరోసారి అదే పనికి రీ టెండర్లు నిర్వహించాలని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేటప్పుడు టెండర్ల ప్రక్రియలో పారదర్శకత పెంపొందించడంతోపాటు ప్రజాధనాన్ని ఆదా చేసేందుకు ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. అయితే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులు, ప్రపంచ బ్యాంక్ వంటి సంస్థల రుణాలతో చేపట్టే పనుల్లో చాలా వరకు కేంద్ర ప్రభుత్వం, ఆయా సంస్థల నియమ నిబంధనల మేరకే టెండర్లు నిర్వహించాల్సి ఉంది. ఇలాంటి సమయంలో ఆయా పనులకు రివర్స్ టెండరింగ్ నిర్వహించాలంటే నిబంధనలు ఆటంకంగా మారాయి.
► గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి సంబంధించి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై) మూడో దశ అమల్లో రాష్ట్రానికి ఈ ఏడాది కొత్తగా 3,285 కి.మీ రోడ్డు పనులు మంజూరయ్యాయి.
► ఈ పనులకయ్యే ఖర్చును 60–40 శాతం చొప్పున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సి ఉంటుంది.
► 935 కి.మీ పొడవునా రూ.535 కోట్లతో చేపట్టే 129 రోడ్ల పనులకు అన్ని అనుమతులు పూర్తయి టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది.
► ఇందులో రూ.150 కోట్ల విలువ చేసే 39 పనులకు పంచాయతీరాజ్ విభాగం టెండర్ పూర్తి చేసింది. వీటిలో 30 పనులకు కాంట్రాక్టర్లు పని అంచనా విలువ మీద 5% దాకా అధిక రేటుకు కోట్ చేశారు.
► పనులకు రివర్స్ టెండరింగ్ నిర్వహించాలంటే కేంద్ర నిబంధనలు అడ్డొస్తున్నాయని అధికారులు చెప్పారు.
► దీంతో ఆ 30 పనులకు మరోసారి టెండర్లు పిలవాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో అధిక ధర కోట్ చేసిన ఆ 30 పనులకు అధికారులు తిరిగి రెండో విడత టెండర్లు నిర్వహించే
ప్రక్రియను చేపట్టారు.
► ప్రభుత్వ తాజా నిర్ణయంతో రూ.150 కోట్లు విలువ చేసే పనుల్లోనే రూ.7.5 కోట్ల మేర ప్రజాధనం ఆదా కాగా.. 3,285 కి.మీ పొడవునా చేపట్టే పనుల్లో దాదాపు రూ.85 కోట్లకు పైబడి ఆదా చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి.
ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రతిభను కనబరచిన అల్ఫోర్స్ జూనియర్ కళాశాల విద్యార్ధులు
29 Jun 2022 7:16 AM GMTHyderabad: ప్రధాని మోడీ పర్యటనకు భారీ భద్రత
29 Jun 2022 6:52 AM GMTజమున హేచరీస్ భూముల పంపిణీ
29 Jun 2022 6:49 AM GMTకోనసీమ జిల్లాలో కలెక్టర్ సుడిగాలి పర్యటన
29 Jun 2022 6:26 AM GMTVijayasai Reddy: ఒకే ఒక్క నినాదంతో ప్లీనరీ నిర్వహిస్తున్నాం
29 Jun 2022 6:15 AM GMTసాలు మోడీ- సంపకు మోడీ .. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా వెలిసిన ఫ్లెక్సీలు
29 Jun 2022 5:41 AM GMTTDP నేత అయ్యన్నపాత్రుడిపై మంత్రి గుడివాడ అమర్నాథ్ ఫైర్
29 Jun 2022 4:58 AM GMT
Rashi Khanna: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాశీ ఖన్నా
29 Jun 2022 10:01 AM GMTఎన్టీఆర్ తో ఐదవ సారి జత కడుతున్న స్టార్ బ్యూటీ
29 Jun 2022 10:00 AM GMTHealth Tips: ఈ జ్యూస్‌లు తాగితే ప్రమాదంలో పడినట్లే..!
29 Jun 2022 9:30 AM GMTNiranjan Reddy: బీజేపీ టూరిస్ట్‌లు నెల రోజులకు ఓసారి వచ్చి...
29 Jun 2022 9:26 AM GMTఅమర్నాథ్ యాత్రకు మొదటి బ్యాచ్.. యాత్రకు వెళ్లిన 3వేల మంది భక్తులు..
29 Jun 2022 9:02 AM GMT