ఏపీలో రాజ్యాంగ సంక్షోభం అంశం విచారణలపై సుప్రీంకోర్టు స్టే

ఏపీలో రాజ్యాంగ సంక్షోభం అంశం విచారణలపై సుప్రీంకోర్టు స్టే
x
Highlights

రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం అంశం విచారణలపై ఏపీ హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించింది సుప్రీంకోర్టు. రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందా లేదా తేలుస్తామని...

రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం అంశం విచారణలపై ఏపీ హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించింది సుప్రీంకోర్టు. రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందా లేదా తేలుస్తామని అక్టోబరు 1న హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. హైకోర్టు జడ్జి వ్యాఖ్యలు కలవరపరిచాయన్న సుప్రీం ధర్మాసనం రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందని హైకోర్టు జడ్జి ఎలా భావించారో అర్థంకాలేదంది. శీతాకాల సెలవుల అనంతరం తదుపరి విచారణ జరపనున్నట్టు తెలిపింది. ఏపీలో పోలీసుల చట్ట ఉల్లంఘనలపై దాఖలైన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్లు, రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న వారిని పోలీసులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌ వేసిన పిల్‌పై హైకోర్టు విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories