Supreme Court: ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిటిషన్.. కేఏ పాల్‌పై సుప్రీం కోర్టు ఆగ్రహం

Supreme Court: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Arun Chilukuri
Published on: 10 Nov 2025 2:52 PM IST
Supreme Court: ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిటిషన్.. కేఏ పాల్‌పై సుప్రీం కోర్టు ఆగ్రహం
X

Supreme Court: ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిటిషన్.. కేఏ పాల్‌పై సుప్రీం కోర్టు ఆగ్రహం

Supreme Court: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెడికల్‌ కాలేజీలను పీపీపీ (PPP - Public-Private Partnership) విధానంలో నిర్వహించాలని తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కేఏ పాల్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్‌ సూర్యకాంత్‌ ధర్మాసనం ఘాటుగా స్పందించింది.

"మీడియాలో ప్రచారం కోసం ఇలాంటి పిటిషన్లు దాఖలు చేస్తున్నారని" ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై ముందుగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించాలని కేఏ పాల్‌కు సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ, పిటిషన్‌పై విచారణకు నిరాకరించింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story