Supreme Court: ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టులో విచారణ

Supreme Court: సమగ్ర నివేదిక ఇచ్చేందుకు సమయం కోరిన ప్రభుత్వం తరపు న్యాయవాది

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 15 July 2024 1:46 PM IST
Supreme Court hearing on illegal sand mining in AP
X

Supreme Court: ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టులో విచారణ

Supreme Court: ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలపై విచారణ జరిపింది సుప్రీంకోర్టు. గతంలోనే ఇసుక అక్రమాలపై సీరియస్ అయిన సుప్రీంకోర్టు సమగ్ర నివేదిక అందించాలని కోరింది. అయితే ఇవాళ్టి విచారణలో నివేదిక సమర్పించేందుకు మరింత సమయం కావాలని జస్టిస్ అభయ్ ఒకా ధర్మాసనాన్ని కోరారు ఏపీ ప్రభుత్వ న్యాయవాది. ఇప్పటికే ఏడు జిల్లాలలో తనిఖీలు పూర్తిచేశామని.. మరో ఆరు జిల్లాల్లో తనిఖీలకు ఆరు వారాల గడువు కావాలని కేంద్ర పర్యావరణ శాఖ న్యాయవాది తెలిపారు. దీంతో ఆగస్టు 2లోపు అక్రమ మైనింగ్ వివరాలు ఇవ్వాలని ఆదేశించింది సుప్రీంకోర్టు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story