Supreme Court: ఇవాళ సుప్రీంకోర్టులో జీవో నం.1 పై విచారణ

Supreme Court: హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ సర్కార్‌

Jyothi
Published on: 20 Jan 2023 9:03 AM IST
Supreme Court Hearing on GO No. 1 Today
X

Supreme Court: ఇవాళ సుప్రీంకోర్టులో జీవో నం.1 పై విచారణ

Supreme Court: ఇవాళ సుప్రీంకోర్టులో జీవో నంబర్‌ 1 పై విచారణ జరగనుంది. ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నంబర్ 1 పై హైకోర్టు స్టే ఇచ్చింది. అయితే.. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఏపీ సర్కార్‌. జీవో నంబర్‌ 1 పై హైకోర్టు స్టే ను సవాల్‌ చేస్తూ పిటిషన్‌ దాఖలు చేసింది. అత్యవసర విచారణ చేపట్టాలంటూ నిన్న సీజేఐ చంద్రచూడ్ ధర్మాసనాన్ని ప్రభుత్వ న్యాయవాది కోరారు. అయితే.. ఇవాళ విచారణ చేపడతామని సీజేఐ ధర్మాసనం తెలిపింది.

Jyothi

Jyothi

Next Story