AP Inter Exams 2021: ఏపీలో ఇంటర్‌ పరీక్షలపై సుప్రీంకోర్టులో విచారణ

AP Inter Exams 2021: ఎల్లుండిలోపు పరీక్షలపై నిర్ణయం చెప్పాలని సుప్రీం ఆదేశం

Sandeep Eggoju
Updated on: 22 Jun 2021 6:18 PM IST
Supreme Court Hearing on Inter Exams in Andhra Pradesh
X

సుప్రీమ్ కోర్ట్ (ఫైల్ ఇమేజ్)

AP Inter Exams 2021: ఏపీలో ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఎల్లుండిలోపు పరీక్షలపై నిర్ణయం చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఒక్క మరణం సంభవించినా ప్రభుత్వానిదే బాధ్యతని స్పష్టం చేసింది. పరీక్షలకు వెళ్లాలనుకుంటే పూర్తి అఫిడవిట్‌ దాఖలు చేయాలన్న సర్వోన్నత న్యాయస్థానం.. పరీక్షల నిర్వహణపై స్పష్టత ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఇప్పటికే 21 రాష్ట్రాలు పరీక్షలను రద్దుచేయగా తాజాగా అస్సాం, పంజాబ్‌, త్రిపుర రాష్ట్రాలు కూడా పరీక్షల రద్దు మొగ్గు చూపుతున్నాయి. దీంతో దాదాపు అన్ని రాష్ట్రాలు పరీక్షల రద్దుపై నిర్ణయం తీసుకున్నాక.. ఇంకా ఏపీకి ఎందుకు అనిశ్చితి అని ప్రశ్నించింది సుప్రీంకోర్టు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story