Supreme Court: సుప్రీంకోర్టులో ఎంపీ అవినాష్‌కు షాక్‌

Supreme Court: ఎంపీ అవినాష్‌ను అరెస్ట్ చేయొద్దంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్వర్వులను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

Arun Chilukuri
Published on: 24 April 2023 4:06 PM IST
Supreme Court Gives Jolt to YS Avinash Reddy
X

Supreme Court: సుప్రీంకోర్టులో ఎంపీ అవినాష్‌కు షాక్‌

Supreme Court: ఎంపీ అవినాష్‌ను అరెస్ట్ చేయొద్దంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్వర్వులను సుప్రీంకోర్టు కొట్టివేసింది. లిఖిత పూర్వక ప్రశ్నలు ఇవ్వాలన్న హైకోర్టు ఆదేశాలను తప్పుబట్టింది. ముందస్తు బెయిల్‌ విష‍యం హైకోర్టులోనే తేల్చుకోవాలని అవినాష్‌ తరపు లాయర్లకు సుప్రీంకోర్టు సూచించింది. అయితే అంతవరకు సీబీఐ అవినాష్‌ రెడ్డిని అరెస్ట్‌ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని అవినాష్ తరపు లాయర్లు కోరగా అందుకు నిరాకరించింది ధర్మాసనం.

ఇక గతంలో ఏప్రిల్‌ 30 వరకు వివేకా హత్య కేసు విచారణ పూర్తి చేయాలని గడువు విధించిన సుప్రీంకోర్టు.. ఆ గడువును జూన్‌ 30 వరకు గడువు పొడిగించింది. అప్పటిలోగా దర్యాప్తు పూర్తి చేయాలని సీబీఐని ఆదేశించింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story