ఏపీలో ఆన్‌లైన్‌ రమ్మీ నిషేధం వద్దన్న హైకోర్టుకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Supreme Court Gives Important Orders To High Court Not To Ban Online Rummy In AP
x

ఏపీలో ఆన్‌లైన్‌ రమ్మీ నిషేధం వద్దన్న హైకోర్టుకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Highlights

AP News: హైకోర్టు తుది తీర్పు 3 వారాల వరకు అమల్లోకి తీసుకురాకూడదన్న సుప్రీం

AP News: ఏపీలో ఆన్‌లైన్ రమ్మీ నిషేధం వద్దన్న హైకోర్టుకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆన్‌లైన్ రమ్మీ నిషేధం వద్దన్న ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసింది. ఆన్‌లైన్ రమ్మీ గేమా ? లేక అదృష్టమా అనే అంశం నిర్ధారించేందుకు కమిటీ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను మధ్యంతర ఉత్తర్వులుగానే పరిగణించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. కమిటీ నివేదిక అందిన తర్వాత అన్ని విషయాలను పరిశీలించాలని ఏపీ హైకోర్టును ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలను హైకోర్టు పరిగణలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. హైకోర్టు తుది తీర్పు 3 వారాల వరకు అమల్లోకి తీసుకురాకూడదని సుప్రీంకోర్టు పేర్కొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories