Supreme Court: ప్రస్తుత పరిస్థితుల్లో జీవో నెంబర్ 1పై జోక్యం చేసుకోలేం..

Supreme Court: ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 1పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

Arun Chilukuri
Published on: 20 Jan 2023 5:35 PM IST
Supreme Court Comments On GO 1
X

Supreme Court: ప్రస్తుత పరిస్థితుల్లో జీవో నెంబర్ 1పై జోక్యం చేసుకోలేం..

Supreme Court: ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 1పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలోని రహదారులపై రోడ్డు షోలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని ప్రభుత్వం జీవో నెంబర్ 1 తీసుకువచ్చింది. జీవో నెంబర్ 1పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఏపీ హైకోర్టును ఆశ్రయించగా జీవోను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం విచారణ జరిపింది.

ప్రస్తుత పరిస్థితుల్లో జీవో నెంబర్ 1పై జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. దీనిపై విచారణ ముగిస్తున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనమే దీనిపై విచారణ చేపడుతుందని, ఈ నెల 23న ధర్మాసనం విచారణ చేపట్టాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఆ ధర్మాసనం ముందే అన్ని అంశాలను ప్రస్తావించాలని ప్రభుత్వానికి సూచించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సోమవారం ఏపీ హైకోర్టు విచారణ చేపట్టనుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story