చంద్రబాబు ఎన్ని చేసినా.. బీజేపీ తలుపులు మూసేసింది : సునీల్‌

చంద్రబాబు ఎన్ని చేసినా.. బీజేపీ తలుపులు మూసేసింది : సునీల్‌
x
Highlights

బాహుబలి లాంటి ఎన్టీఆర్‌ను కట్టప్ప లాంటి చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని ఏపీ బీజేపీ ఇన్‌చార్జ్, కేంద్ర మంత్రి సునీల్ దేవధర్ అన్నారు. మోసాలు, అక్రమాలు,...

బాహుబలి లాంటి ఎన్టీఆర్‌ను కట్టప్ప లాంటి చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని ఏపీ బీజేపీ ఇన్‌చార్జ్, కేంద్ర మంత్రి సునీల్ దేవధర్ అన్నారు. మోసాలు, అక్రమాలు, అవినీతికి చంద్రబాబు చిరునామా అంటూ తీవ్ర స్ధాయిలో విమర్శలు గుప్పించారు. ఓటర్లకు డబ్బు పంచడం దగ్గరి నుంచి రాజ్యసభ సీట్లు అమ్ముకోవడం వరకు చంద్రబాబుకే చెల్లుబాటు అవుతోందని ఆరోపించారు. టీడీపీతో ఎట్టి పరిస్ధితుల్లోనూ పొత్తు ఉండదని మరోసారి స్పష్టం చేశారు. ప్రధాని మోడీ దగ్గరి నుంచి తన వరకు ఇదే అంతిమ నిర్ణయమన్నారు. ఎన్నికలకు ముందు బీజేపీని దూషించి ఇప్పుడు తప్పు చేశానంటూ చెప్పినంత మాత్రన తమ విధానాంలో మార్పు రాదని సునీల్ దేవధార్ తేల్చి చెప్పారు. బీజేపీకి చేరువయ్యేందుకు చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories