అమరావతి కాపాడలేకపోతే ఈ పదవులెందుకు: సుజనా సంచలన వ్యాఖ్యలు..!

అమరావతి కాపాడలేకపోతే ఈ పదవులెందుకు: సుజనా సంచలన వ్యాఖ్యలు..!
x
సుజనాచౌదరి
Highlights

రాజధాని ఉద్యమంలో మహిళల ఆవేదన కలిచి వేస్తుందన్నారు బీజేపీ ఎంపీ సుజనాచౌదరి. మహిళల పట్ల పోలీసులు, ప్రభుత్వ తీరు దారుణంగా ఉందన్నారు. రాజధానిని...

రాజధాని ఉద్యమంలో మహిళల ఆవేదన కలిచి వేస్తుందన్నారు బీజేపీ ఎంపీ సుజనాచౌదరి. మహిళల పట్ల పోలీసులు, ప్రభుత్వ తీరు దారుణంగా ఉందన్నారు. రాజధానిని కాపాడలేకపోతే పదవులు ఎందుకని ప్రశ్నించారు. పోలీసులు అరెస్ట్ చేసిన నిరసనకారుల కులాలు ఎందుకు అడుగుతున్నారని సుజనా చౌదరి ప్రశ్నించారు. వైసీపీ ర్యాలీలకు అనుమతిస్తూ రాజధానికోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిని ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు.

రాజధానికి బీజేపీ సహకరిస్తుందని అవసరమైతే వ్యక్తిగతంగా పోరాడుతానని సుజనా చౌదరి చెప్పారు. భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఇంత దారుణంగా పరిపాలించిన దాఖలాలు కన్పించడం లేదన్న సుజనా, ఇప్పటికైనా ప్రాంతీయ విద్వేషాలు మానుకుంటే మంచిదని సూచించారు. 13 జిల్లాలు ప్రజలు విజృంభించాలని మేథావులు, ఎన్జీవోలు కూడా రైతుల ఉద్యమంలో భాగమవ్వాలని పిలుపునిచ్చారు. రాజధాని సమస్యను పరిష్కరించకపోతే ఈ 10 ఏళ్లు చేసిన ఎంపీ పదవి, ఇకముందు చేయబోయేది కూడా అనవసరమన్నారు. డీజీపీ అధికార పార్టీకి చెందిన వ్యక్తిలా మాట్లాడుతున్నారని, ర్యాలీలకు అనుమతి లేనప్పుడు వైసీపీ కార్యకర్తలకు ఎందుకు అనుమతి ఇస్తున్నారని ప్రశ్నించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories