Sujana Chowdary: విజయవాడ వెస్ట్‌‌లో ప్రచారజోరు పెంచిన కూటమి అభ్యర్థి సుజనా చౌదరి

Sujana Chowdary: వాడవాడలా తిరుగుతూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్న సుజనా చౌదరి

Shashank Gullapelli
Published on: 29 April 2024 1:42 PM IST
Sujana Chowdary Election Campaign  In Vijayawada West
X

Sujana Chowdary: విజయవాడ వెస్ట్‌‌లో ప్రచారజోరు పెంచిన కూటమి అభ్యర్థి సుజనా చౌదరి

Sujana Chowdary: విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కూటమి అభ్యర్థి సుజనా చౌదరి ఎన్నికల ప్రచార జోరు పెంచారు. వాడవాడలా తిరుగుతూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. 38 డివిజన్‌లోని పున్నమిఘాట్, విద్యాధరపురం, కుమ్మరిపాలెం, నాలుగు స్తంభాల సెంటర్ ప్రాంతాల్లో పర్యటించారు. ఒకవైపు ప్రజా సమస్యలు తెలుసుకుంట.. తనను గెలిపిస్తే నియోజకవర్గానికి ఏం చేస్తాననే విషయాలను ఓటర్లకు వివరిస్తున్నారు. దేశంలో మోడీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, రాష్ట్రంలో బాబు విజన్‌, పవన్‌ కల్యాణ్‌ నిబద్దతను ఓటర్లకు తెలియజేస్తూ....ముందుకు పోతున్నారు.

వైసీపీ ప్రకటించిన మ్యానిఫెస్టో చిత్తు కాగితమని అభివర్ణించిన ఆయన... ఎన్నికల్లో జగన్‌‌కు ప్రజలే గుణపాఠం చెప్తారన్నారు. అమరావతిని అణగదొక్కి ఏపీ అభివృద్ధికి అడ్డంకులు సృష్టించిన వైసీపీకి ఎన్నికల్లో ఓటుతోనే బుద్ధి చెప్పాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. పాత మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా వైసీపీ కొత్త మేనిఫెస్టో విడుదల చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు సుజనాచౌదరి. నియోజకవర్గంలోని ముస్లిం మైనారిటీలకు అండగా ఉంటానని వక్ఫ్ బోర్డు ఆస్తులను పరిరక్షిస్తామని హామీ ఇచ్చారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story