Andhra Pradesh: సచివాలయం ముందు దంపతుల ఆత్మహత్యాయత్నం

Andhra Pradesh: ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు ప్రయత్నించిన దంపతులు

Sandeep Eggoju
Published on: 27 Feb 2021 1:25 PM IST
Suicide Attempt by a couple in front of the Secretariat
X

Suicide Attempt by a Couple(ఫైల్ ఇమేజ్)

Andhra Pradesh: ఏపీ సచివాలయం ముందు నెల్లూరు జిల్లాకు చెందిన దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఇద్దరు పిల్లలతో, పెట్రోల్ డబ్బాతో వచ్చి ఆత్మహత్యాయత్నం చేశారు. ఇది గమనించిన సచివాలయ పోలీసులు వారిని కాపాడారు. నెల్లూరు జిల్లా దుత్తలూరు ఎమ్మార్వో చంద్రశేఖర్ తమను మోసం చేశారని దంపతులు తెలిపారు. పొలం ఆన్‌లైన్ చేస్తానని కోటి రూపాయలకు పైగా తీసుకుని మోసం చేసినట్టు ఆరోపించారు. ఆత్మహత్యకు యత్నించిన దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story