Annamayya District: బల్లిపడిన ఆహారం‌ తిని విద్యార్ధులకు అస్వస్థత

Annamayya District: నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

Shekhar G
Published on: 22 Nov 2023 6:40 PM IST
Students Get Sick After Eating Spoiled Food In Annamayya District
X

Annamayya District: బల్లిపడిన ఆహారం‌ తిని విద్యార్ధులకు అస్వస్థత

Annamayya District: బల్లిపడిన ఆహారం‌ తిని విద్యార్ధులకు అస్వస్థతకు గురైన ఘటన అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది.. మదనపల్లె మండలంలోని బొమ్మనుచెరువు పంచాయతీ టేకులపాళ్యం‌ ప్రభుత్వ పాఠశాలలో యధావిధిగా విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం తయారు చేస్తున్న సమయంలో బల్లి ఆహారంలో పడింది..దీని గమనించని వంట మనుషులు ఆ ఆహారంను నేరుగా విద్యార్ధులకు వడించారు.. దీంతో ఆ ఆహారం తిని 45 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.. దీంతో విద్యార్థులను మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు బల్లి పడిన ఆహారంను అలాగే విద్యార్ధులకు వడించిన వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Shekhar G

Shekhar G

Next Story