ఎన్నికల నియమావళిని ఖచ్చితంగా పాటించాలి: ఎస్ఈసీ

Strict adherence to electoral code: SEC
x

ఫైల్ ఇమేజ్


Highlights

Amaravathi: రాజకీయ పార్టీలు ఎన్నికల నియమావళిని ఖచ్చితంగా పాటించాలని ఎస్ఈసీ నిమ్నగడ్డ రమేష్ కుమార్ ఆదేశించారు.

Amaravathi: రాజకీయ పార్టీలు ఎన్నికల నియమావళిని ఖచ్చితంగా పాటించాలని ఎస్ఈసీ నిమ్నగడ్డ రమేష్ కుమార్ రాజకీయపార్టీలను ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అన్నిపార్టీల నుంచి అభిప్రాయాలు సేకరించారు. పంచాయతీ ఎన్నికల్లో మాదిరిగా కాకుండా అక్రమాలు లేకుండా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని రాజకీయ పార్టీల నేతలు సూచించారు. పలు అంశాలను ఎస్ఈసీ దృష్టికి తీసుకువెళ్లిన రాజకీయ పార్టీల నేతలు పరిష్కరించాలని కోరాయి..

అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి....

ఏపీలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కోరారు. ఎన్నికల్లో పాటించాల్సిన అంశాలపై ఎస్ఈసీ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. పార్టీల వారీగా అభిప్రాయాలు, సూచనలు తీసుకున్నారు.

కోడ్ ఆఫ్ కండక్ట్ ను తప్పనిసరిగా పాటించాలి.....

ఎన్నికల ప్రచారంలో కోడ్ ఆఫ్ కండక్ట్ ను రాజకీయపార్టీలు తప్పనిసరిగాపాటించాలని ఆదేశించారు. ఐదుగురికి మించి ప్రచారంలో పాల్గొనవద్దని సూచించారు. కోవిడ్ నిబంధనలు విధిగాపాటించాలన్నారు. ఓటర్లకు మధ్యం, డబ్బు పంపిణీ చేస్తూ ప్రలోభాలకు గురి చేయవద్దని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘింటనట్లయితే కఠిన చర్యలు ఉంటాయని.. అవసరమైతే క్రమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

అక్రమాలపై చర్యలు తీసుకోవాలి: టిడిపి

పంచాయతీ ఎన్నికల్లో మాదిరిగా అక్రమాలపై చర్యలు తీసుకోవాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఎస్ఈసీని కోరారు. నాలుగుదశల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో దౌర్జన్యాలు, దాడులపై చెప్పేందుకు ప్రయత్నిస్తే ఎస్ఈసీ నిరాకరించారన్నారు. మున్సిపల్ ఎన్నికలు పారదర్శకంగా ,చట్టబద్దంగా,చిత్త శుద్దితో వ్యవహరించాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.

చంద్రబాబు పై వైసీపీ ఫిర్యాదు...

ఎన్నికల సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేతలు ఎస్ఈసీ దృష్టికి తీసుకు వచ్చారు. ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో ఆరాచకాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నిబంధనలపేరుతో వాలంటీర్ల మొత్తం వ్యవస్థను నిలుపుదల చేయవద్దని కోరారు. వాలంటీర్ల హక్కులు కాలరాసినట్లవుతుందన్నారు.

ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించాలన్న రాజకీయపార్టీలు..

సమావేశంలో కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ నేతలు పాల్గొన్నారు. ఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంతంగా, ఎలాంటి దాడులు, అక్రమాలకు తావు లేకుండా జరపాలని అన్ని రాజకీయ పార్టీలు ఎస్ఈసీ ని కోరాయి....

Show Full Article
Print Article
Next Story
More Stories