Kalipatnam Ramarao: కథా రచయిత కాళీపట్నం రామారావు కన్నుమూత

Kalipatnam Ramarao: ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావు కన్నుమూశారు.

Arun Chilukuri
Published on: 4 Jun 2021 12:37 PM IST
Story Writer Kalipatnam Rama Rao Passes Away
X

కాళీపట్నం రామారావు(ఇమేజ్ సోర్స్ ది హన్స్ ఇండియా )

Kalipatnam Ramarao: ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావు కన్నుమూశారు. కొంతకాలంగా వయోభారంతో ఉన్న ఆయన.. శ్రీకాకుళంలో తన నివాసంలో ఇవాళ తుదిశ్వాస విడిచారు. 1924లో లావేరు మండలం మురపాకలో ఆయన జన్మించారు. కారా మాస్టారుగా ప్రసిద్ధి పొందిన ఆయన శ్రీకాకుళం నగరంలో కథా నిలయాన్ని స్థాపించారు. తన రచనలకు గాను పలు కేంద్ర, రాష్ట్ర అవార్డులు పొందారు. అనేక యూనివర్శిటీల నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు.

కథా సాహిత్యానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకొంటూ రచయితలు, కవులు, కళాకారుల నివాళులర్పించారు. ఆయన లేని లోటు ఎన్నటికీ పూడ్చలేనిదంటూ పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. కథకు చిరునామాగా, 'కథానిలయం' పేరుతో భావి తరాల కోసం సాహితీ సంపదను కాపాడిన సాహితీ మూర్తి కారా మాస్టారు అంటూ కొనియాడారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story