చంద్రబాబు ప్రయాణిస్తున్న బస్సుపై రాళ్ల దాడి

చంద్రబాబు ప్రయాణిస్తున్న బస్సుపై రాళ్ల దాడి
x
చంద్రబాబు
Highlights

చంద్రబాబునాయుడు చేపట్టిన అమరావతి టూర్‌ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బాబు పర్యటనకు అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య వెంకటపాలెంలో ఘర్షణ జరిగింది....

చంద్రబాబునాయుడు చేపట్టిన అమరావతి టూర్‌ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బాబు పర్యటనకు అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య వెంకటపాలెంలో ఘర్షణ జరిగింది. చంద్రబాబు కాన్వాయ్‌ని చూడగానే ఓ వర్గం వారు ఆయన ప్రయాణిస్తున్న వాహనంపై చెప్పులు, రాళ్లు రువ్వారు. పోటాపోటీగా నినాదాలు చేశారు. బాబు కాన్వాయ్ వైపు దూసుకెళ్లేందుకు ఓ వర్గం రైతులు విఫలయత్నం చేయడంతో, పోలీసులు వారిని అడ్డుకున్నారు. వారిని చెదరగొట్టి, కాన్వాయ్ కి దారి కల్పించారు. బాబు పర్యటన ఓ వైపు స్వాగతం, మరోవైపు నిరసనల మధ్య సాగుతోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories