కోనసీమలో మళ్లీ టెన్షన్.. ఎస్పీ కారుపై రాళ్ల దాడి!

Ravulapalem: కోనసీమ జిల్లా రావులపాలెంలో ఉద్రిక్తత నెలకొంది. రావులపాలెం రింగురోడ్‌ వద్ద తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి కారుపై ఆందోళన కారులు రాళ్లు విసిరారు.

Arun Chilukuri
Published on: 25 May 2022 7:38 PM IST
Stone Pelting on East Godavari SP Aishwarya Rastogi Vehicle
X

కోనసీమలో మళ్లీ టెన్షన్.. ఎస్పీ కారుపై రాళ్ల దాడి!

Ravulapalem: కోనసీమ జిల్లా రావులపాలెంలో ఉద్రిక్తత నెలకొంది. రావులపాలెం రింగురోడ్‌ వద్ద తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి కారుపై ఆందోళన కారులు రాళ్లు విసిరారు. దీంతో పోలీసులు ఆందోళనకారుల వెంటపడటంతో అక్కడి నుంచి పరారయ్యారు. రావులపాలెంలో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో ఎస్పీ వాహనం పూర్తిగా దెబ్బతింది. కోనసీమ జిల్లా పేరును కొనసాగించాలంటూ కోనసీమ సాధన సమితి నేడు చలో రావులపాలెంకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే నిన్న అమలాపురంలో చోటుచేసుకన్న హింసాత్మక ఘటన నేపథ్యంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story