Steel ‌Plant: స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యమం తాత్కాలికంగా వాయిదా

విశాఖ జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యమాన్ని ఆందోళనకారులు తాత్కాలికంగా వాయిదా వేశారు.

Arun Chilukuri
Published on: 10 March 2021 11:45 AM IST
Steel ‌Plant: స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యమం తాత్కాలికంగా వాయిదా
X

ఫైల్ ఇమేజ్ 

Steel ‌Plant: విశాఖ జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యమాన్ని ఆందోళనకారులు తాత్కాలికంగా వాయిదా వేశారు. జాతీయ రహదారిపై ఆందోళన చేస్తున్న నిర్వాసితులు, స్టీల్‌ కార్మికులు నిరసన కార్యక్రమాలు విరమించారు. అయితే స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనకు తీసుకునే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం తన ఆలోచనను మార్చుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇదిలా ఉంటే.. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సమాచారం. నిర్వాసితులు, ఒప్పంద ఉద్యోగులతో పాటు సంస్థతో భాగస్వాములైన వారందరితో చర్చించి ఉద్యమాన్ని ఏ విధంగా ఉద్ధృతం చేయాలో కసరత్తు చేస్తున్నట్లు కార్మిక సంఘం నేతలు తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story