Nellore: మహిళాలపై ఓ బ్యాంకు మేనేజర్‌ వికృతచేష్టలు

Nellore: ఆర్థిక వ్యవహారాలతో పాటు పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన ఓ బ్యాంకు మేనేజర్ కామాంధుడిగా వ్యవహరించారు.

Arun Chilukuri
Published on: 3 July 2021 5:44 PM IST
State Bank Manager MisBehaving with Female Customers In Nellore
X

Nellore: మహిళాలపై ఓ బ్యాంకు మేనేజర్‌ వికృతచేష్టలు

Nellore: ఆర్థిక వ్యవహారాలతో పాటు పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన ఓ బ్యాంకు మేనేజర్ కామాంధుడిగా వ్యవహరించారు. మహిళా ఖాతాదారుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. మహిళల పట్ల బ్యాంకు మేనేజర్ చేస్తున్న వికృతచేష్టలు బ్యాంకులో ఉన్న సీసీ ఫుటేజీ ద్వారా బయటపడ్డాయి. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మేనేజర్ బ్యాంక్ నుంచి వెళ్ళిపోయారు.

నెల్లూరు జిల్లా పొదలకూరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడి బ్రాంచ్‌ మేనేజర్‌ గత కొంత కాలంగా పొదుపు, క్రాపు, ఇతరత్రా లోన్లు కోసం బ్యాంకుకు వచ్చే మహిళలకు అవసరం లేకున్నా, తన ఛాంబర్ లోకి పిలిపించుకొని సొల్లు కబుర్లు చెబుతుంటారు. లోన్లు కట్టలేనివారిని, లోన్లు కావాల్సిన గృహిణులను టార్గెట్‌గా చేసుకొని, వారి ఆర్థిక అవసరాలను ఆసరాగా మలుచుకొని మానసికంగా, శారీరంగా వేధిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అతనిపై చర్యలు తీసుకొవాలని ఖాతాదారులు కోరుతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story