ప్రభుత్వంతో వ్యాపారం లాభదాయకం.. పెట్టుబడి అవసరమే ఉండదు..!

Start this business for free with Govt Earn good income every month
x

ప్రభుత్వంతో వ్యాపారం లాభదాయకం.. పెట్టుబడి అవసరమే ఉండదు..!

Highlights

ప్రభుత్వంతో వ్యాపారం లాభదాయకం.. పెట్టుబడి అవసరమే ఉండదు..!

Business Idea: మీరు పెట్టుబడి లేకుండా సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ఈ వార్త మీకు బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఎలాంటి పెట్టుబడి లేకుండా మంచి ఆదాయాన్ని సంపాదించవచ్చు. ప్రభుత్వ కంపెనీల ఫ్రాంచైజీని ఓపెన్‌ చేయడం ద్వారా సొంత వ్యాపారం ప్రారంభించవచ్చు. ఇందులో పెట్టుబడి అవసరం ఉండదు. లాభాలు బాగా ఉంటాయి.. నష్టం జరిగే అవకాశాలు చాలా తక్కువ. అంతేకాదు ప్రభుత్వ ఫ్రాంచైజీతో కలిసి పని చేయడం సరదాగా ఉంటుంది. సంపాదన కూడా బంపర్‌గా ఉంటుంది.

ఆధార్ కార్డ్ ఫ్రాంచైజ్

ఈ రోజుల్లో దేశంలో నివసించే ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డ్ ఒక ముఖ్యమైన పత్రం. అందుకే దీనికి చాలా డిమాండ్‌ ఉంటుంది. మీరు ఆధార్ కార్డ్ ఫ్రాంచైజీని తీసుకోవచ్చు. ఈ బిజినెస్‌ ద్వారా మంచి డబ్బు సంపాదించవచ్చు. ఆధార్ కార్డు ఫ్రాంచైజ్ తీసుకోవాలనుకుంటే ముందుగా మీరు UIDAI నిర్వహించిన పరీక్షను క్లియర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సేవా కేంద్రాన్ని తెరవడానికి లైసెన్స్ వస్తుంది. మీరు పరీక్షను క్లియర్ చేసిన తర్వాత ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ నంబర్, బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. తరువాత కామన్ సర్వీస్ సెంటర్ నుంచి రిజిస్ట్రేషన్ చేయవలసి ఉంటుంది.

ఆధార్‌ కార్డు ప్రాంచైజీకి ఎలా దరఖాస్తు చేయాలి..?

1. ఆధార్ ఫ్రాంచైజీ లైసెన్స్ తీసుకోవడానికి ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://uidai.nseitexams.com/UIDAI/LoginAction_input.actionకి వెళ్లాలి.

2. ఇక్కడ 'క్రియేట్ న్యూస్ యూజర్' అనే ఆప్షన్ వస్తుంది. దీనిపై క్లిక్ చేసిన తర్వాత కొత్త ఫైల్ ఓపెన్ అవుతుంది.

3. ఇందులో మిమ్మల్ని 'షేర్ కోడ్ ఎంటర్' అని అడుగుతారు. దీనికోసం మీరు https://resident.uidai.gov.in/offline-kyc ని సందర్శించి ఆఫ్‌లైన్ ఈ-ఆధార్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి .

4. తర్వాత 'XML ఫైల్', 'షేర్ కోడ్' రెండింటినీ డౌన్‌లోడ్ చేయాలి.

5. దరఖాస్తు చేస్తున్నప్పుడు స్క్రీన్‌పై ఒక ఫారమ్ ఓపెన్‌ అవుతుంది. ఇందులో అడిగిన మొత్తం సమాచారాన్ని అందించి సమర్పించాలి.

6. ఫోన్ నెంబర్‌కి, ఈ-మెయిల్ IDకి'USER ID', 'Password' వస్తాయి. ఈ ID, పాస్‌వర్డ్ ద్వారా 'ఆధార్ టెస్టింగ్, సర్టిఫికేషన్' పోర్టల్‌కి సులభంగా లాగిన్ కావొచ్చు. తర్వాత 'కంటిన్యూ' ఎంపిక కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.

7. తర్వాత ఒక ఫారమ్ ఓపెన్‌ అవుతుంది. అభ్యర్థించిన మొత్తం సమాచారాన్ని అందించాలి. తర్వాత మీ ఫోటో, డిజిటల్ సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి. తర్వాత మొత్తం సమాచారాన్ని సరిగ్గా పూరించారా లేదా అని చెక్‌ చేయాలి. ఆపై 'ప్రొసీడ్ టు సబ్‌మిట్ ఫారమ్'పై క్లిక్ చేయడం ద్వారా కొనసాగవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories