ఫిబ్రవరి నెల శ్రీవారి దర్శన టికెట్లు 28న విడుదల

TTD: టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో టికెట్లు పొందే అవకాశం. వ్యాక్సినేషన్ లేదా నెగిటీవ్ సర్టిఫికెట్ తీసుకురావాలని సూచన.

Sriveni Erugu
Published on: 27 Jan 2022 9:54 AM IST
Srivari Darshan tickets will be released on the 28th of February
X

ఫిబ్రవరి నెల శ్రీవారి దర్శన టికెట్లు 28న విడుదల 

TTD: ఫిబ్రవరి నెలకు సంబంధించి శ్రీవారి దర్శన టికెట్లు విడుదల చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఈ నెల 28న ఉదయం 9 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, 29న ఉదయం 9 గంటలకు సర్వదర్శన టికెట్లు విడుదల చేయనుంది. టీటీడీ అధికారిక వెబ్ సైట్ లో టికెట్లను పొందవచ్చని తెలిపిన టీటీడీ.. టికెట్లను బుక్ చేసుకున్న భక్తులు.. తప్పకుండా కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ లేదా నెగిటివ్ సర్టిఫికెట్ వెంట తీసుకురావాలని కోరింది.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story