శ్రీవారి భక్తులకు శుభవార్త.. తిరుపతిలోనే శ్రీవాణి దర్శనం టికెట్లు

Srivani Darshan Tickets Available In Tirupati Itself
x

శ్రీవారి భక్తులకు శుభవార్త.. తిరుపతిలోనే శ్రీవాణి దర్శనం టికెట్లు 

Highlights

శ్రీవారి భక్తులకు శుభవార్త.. తిరుపతిలోనే శ్రీవాణి దర్శనం టికెట్లు

Srivani Darshan Tickets: శ్రీవారి భక్తుల సౌకర్యార్ధం తిరుపతిలో అఫ్ లైన్‌లో శ్రీవాణి ట్రస్టు టిక్కెట్ల జారీ కేంద్రాన్ని టీటీడీ అందుబాటులోకి తీసుకొచ్చింది. నేటి నుండి శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టిక్కెట్లను తిరుపతిలోని మాధవం అతిథిగృహంలో జారీ చేయనుంది. ఇవాళ ఉదయం టీటీడీ జేఈవో వీరబ్రహ్మం శ్రీవాణి ట్రస్టు జారీ కేంద్రాన్ని ప్రారంభించారు. మొదటగా టిక్కెట్లు పొందిన భక్తులకు జేఈవో టిక్కెట్టు అందజేశారు. ఈ సందర్భంగా టీటీడీ జేఈవో వీరబ్రహ్మం మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవాణి ట్రస్ట్ కు విరాళం ఇచ్చే భక్తులకు టికెట్స్ ఇచ్చేందుకే ఆఫ్ లైన్ విధానాన్ని తిరుపతిలో తీసుకొచ్చామన్నారు.

టికెట్లతోపాటు వసతిని కుడా మాధవం అతిథిగృహంలో కల్పిస్తున్నామని దీంతో తిరుమలలో వసతి ఒత్తిడి తగ్గుతుందని తెలిపారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా వచ్చే విరాళాలతో పురాతన ఆలయాల అభివృద్ధి, జీర్ణోద్ధరణ, కొత్తగా ఆలయాలు, భజన మందిరాలు నిర్మిస్తున్నామని వీరబ్రహ్మం తెలిపారు. ఈ ట్రస్టు ద్వారా తొలివిడత లో తెలుగు రాష్ట్రాల్లో 502 ఆలయాలు నిర్మించామని చెప్పారు. రెండో విడతలో సుమారు 1500 ఆలయాల నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. శ్రీవాణి ట్రస్టుకు విరాళం ఇచ్చే భక్తులు తిరుపతిలోని మాధవం అతిథిగృహం లో ఏర్పాటు చేసిన కౌంటర్లను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. టీటీడీ చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, యూనియన్ బ్యాంకు రీజనల్ హెడ్ రాం ప్రసాద్, చీఫ్ మేనేజర్లు బ్రహ్మయ్య , నగేష్ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories