Srisailam: ఊటీలా మారిన శ్రీశైల క్షేత్రం

Srisailam: నల్లమలలో చలి తీవ్రత భారీగా పెరిగింది. పొగమంచుతో నల్లమల ఘాట్‌ రోడ్డు.. మంచుదుప్పటి కప్పుకున్నట్టు కనిపిస్తోంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 25 Nov 2024 10:18 AM IST
Srisailam Devotees Facing Problems With Fog
X

Srisailam: ఊటీలా మారిన శ్రీశైల క్షేత్రం

Srisailam: నల్లమలలో చలి తీవ్రత భారీగా పెరిగింది. పొగమంచుతో నల్లమల ఘాట్‌ రోడ్డు.. మంచుదుప్పటి కప్పుకున్నట్టు కనిపిస్తోంది. శ్రీశైలానికి వచ్చే రహదారులన్నీ పొగమంచుతో కప్పబడి ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మరోవైపు శీతాకాలపు మంచు అందాలతో శ్రీశైల క్షేత్రం మరో ఊటీలా మారింది. మల్లన్న ఆలయంతో పాటు పలు ప్రదేశాల్లో మంచు తీవ్రత అధికంగా ఉంది. పొగమంచుతో కప్పబడి ఉన్న ఆలయ పరిసరాలను చూసి భక్తులు ఆహ్లాదం పొందుతున్నారు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story