Payakaraopeta: సీఎం రిలీఫ్ ఫండ్ కి విరాళం అందించిన శ్రీ ప్రకాష్ విద్యా సంస్థ

S. Srikanth
Published on: 20 April 2020 10:19 PM IST
Payakaraopeta: సీఎం రిలీఫ్ ఫండ్ కి విరాళం అందించిన శ్రీ ప్రకాష్ విద్యా సంస్థ
X

పాయకరావుపేట: పట్టణంలోని శ్రీ ప్రకాష్ విద్యా సంస్థలోని బోధనేతర సిబ్బందికి యాజమాన్యం సమకూర్చిన నిత్యావసర సరుకులను ఎమ్మెల్యే గొల్ల బాబూరావు చేతుల మీదుగా సోమవారం పంపిణీ చేశారు. తమ సంస్థలో పని చేస్తున్న డ్రైవర్లు, ఆయాలు, క్లీనర్లు, సెక్యూరిటీ తదితర బోధనేతర సిబ్బంది 500 మందికి రూ. 4 లక్షల విలువ గల 22 రకాల నిత్యావసర సరుకులను అందజేశారు.

కరోనా నివారణ చర్యలకై సిఎం రిలీఫ్ ఫండ్ కి 2 లక్షల రూపాయల చెక్కును ఎమ్మెల్యేకి శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల సంయుక్ట కార్యదర్శి సి హెచ్ విజయ్ ప్రకాష్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ధనిశేట్టి బాబూరావు, గూటూరు శ్రీను, దగ్గుబిల్లి సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.


S. Srikanth

S. Srikanth

Next Story